రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Jan 25,2024 15:50 #ex cm kcr

హైదరాబాద్‌ : ఈ నెల 26వ తేదీన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు.

➡️