నేటి నుంచి అసెంబ్లీ

Feb 5,2024 07:49 #ap assembly, #meetings

– తొలిరోజు గవర్నరు ప్రసంగం

– మూడు రోజులు నిర్వహించే ఆలోచన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలో సోమవారం నుంచి జరగనున్నాయి. మొదటిరోజు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం పది గంటలకు గవర్నరు ప్రసంగం ప్రారంభమవుతుంది. అనంతరం సభ వాయిదా వేయనున్నారు. గవర్నరు ప్రసంగం, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌, బిల్లుల ఆమోదానికి మరొకరోజు మొత్తం మూడురోజులు సభ జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులు నిర్వహించాలనేది సోమవారం ఉదయం జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బిఎసి)లో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్‌ బిల్లుపైనా చర్చించనున్నారు. డిఎస్‌పి పోస్టుల భర్తీ, పెట్టుబడులు, డిబిటి తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చలూ జరపనున్నారు.

➡️