సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణం : సీపీఐ నారాయణ

Dec 12,2023 14:29 #cpi narayana, #press meet

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని వైసిపి అధిష్ఠానాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ”తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ప్రభుత్వం మార్పు తప్పదు. జగన్‌ పాలనలో అహంకారం, నియంతఅత్వం పెరిగిపోయింది. ఆయన హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి. సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణం” అని నారాయణ విమర్శించారు.

➡️