పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మందికి గాయాలు

Apr 10,2024 12:45 #ananthapuram, #road accident

అనంతపురం: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు డివైడర్‌ను ఢీ కొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ విషాదకర సంఘటన పామిడి మండలం గజరాంపల్లి వద్ద బుధవారం చోటు చేసుకుంది. ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️