2024 election: ఎన్నికల ముందు వైసీపీకి బిగ్‌ షాక్‌.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

Mar 7,2024 11:59 #resigns, #Vasireddy Padma, #YCP

ప్రజాశక్తి – అమరావతి : ఎన్నికలకు ముందు వైసిపికి బిగ్‌ షాక్‌ తగిలింది. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్‌కు పంపారు. వచ్చే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాని టికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు. అయితే సీఎం జగన్‌ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడతో ఆమె మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పని చేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

➡️