గర్భం దాల్చిన ‘నారాయణ’ విద్యార్థిని

Feb 27,2024 08:17 #Narayana school, #rape attempt
  • వ్యాయామ ఉపాధ్యాయుడి అరెస్టు

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : విశాఖపట్నం జిల్లా మధురవాడలోని నారాయణ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎసిపి సిహెచ్‌.వివేకానంద కథనం ప్రకారం… పోతినమల్లయపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి కారుషెడ్‌ సమీపంలో ఉన్న నారాయణ పాఠశాలలో మధురవాడకు చెందిన బాలిక తొమ్మిదవ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో బి.దుర్గాప్రసాద్‌ పిఇటిగా విధులు నిర్వహిస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్‌లో పిఇటి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొద్దిరోజుల నుంచి బాలిక అనారోగ్యంగా ఉండడాన్ని గమనించిన ఆమె తల్లి వైద్యులకు చూపించారు. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఇటి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎసిపి తెలిపారు. నిందితునికి ఏడాదిన్నర క్రితమే వివాహమైనట్లు ఎసిపి చెప్పారు.

➡️