అక్రమంగా అరెస్టు చేశారు : సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌

న్యూఢిల్లీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ … న్యూఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంలో… సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నేడు ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు.

➡️