అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్‌ పోల్‌ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల కానున్నాయి. ఇక, తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

➡️