కనీసం రూ.50వేల కోట్లు : సిఎంకు అధికారుల నివేదన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో రానున్న రెండు నెలలకాలానికి అవసరమైన నిధుల సమీకరణ, పథకాల నిర్వహణ, అదే విధంగా ఓట్‌ఆన్‌అక్కౌంట్‌ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఆర్థిక పరిస్థితిపై ఆరాతీసిన సిఎంకు అధికారులు ఉన్న పరిస్థితిని ఉన్నట్లుగానే వివరించి, క్లిష్టంగా ఉందని చెప్పినట్లు తెలిసింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షిరచారు. ఖజానా పరిస్థితిపై ఆరా తీసారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇరకా కేవలం రెరడు నెలలు మాత్రమే ఉరడడం, ఎన్నికలకు మరో మూడు నెలల కాలం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆరా తీయడం గమనార్హం. ఈ రెరడు నెలల కాలంలో ప్రభుత్వం అరదిరచే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు నిధుల లోటు రాకుండా చూడాలని ఈ సందర్భరగా ముఖ్యమంత్రి అధికారులకు సూచిరచారు. అలాగే కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అక్కౌరట్‌ బడ్జెట్‌పైనా ఆర్థికశాఖతో ఆయన చర్చిరచారు. ఈ సందర్భంగానే రానున్న రెరడు నెలలకు కనీసం 50 వేల కోట్ల వరకు కావాల్సి ఉరటురదని వారు చెప్పినట్లు తెలిసిరది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నురచి చివరి నెలల్లో వచ్చే ఆదాయం కలిపి కొరతవరకు సర్దుకోవచ్చని, అయినా మరికొంత సమీకరించుకోవాల్సిఉంటుందని వారు తెలిపారు. అలాగే డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయం, చేసిన వ్యయం, లోటు అరశాలను కూడా అధికారులు పవర్‌ పాయిరట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరిరచినట్లు సమాచారం. జనవరిలో కూడా రావాల్సిన, వచ్చిన ఆదాయం వివరాలను వివరిరచారు. ప్రధానంగా ఇప్పుడు లబ్ది అరదుకురటున్న లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశిరచారు. అలాగే గురువారం కేంద్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయిరపులను అధ్యయనం చేసి, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కూడా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ముఖ్య కార్యదర్శి గుల్జార్‌, కార్యదర్శి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️