తెలంగాణలో దారుణం.. తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం

Jan 20,2024 11:12 #rape attempt, #Telangana
Rajastha 8-year-old schoolgirl gang-raped by driver, his f

హైదరాబాద్‌ : తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్నాపూర్‌లో పెద్దిరాజు అనే ఓ వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తన వద్దకు కూలీ పనికి వచ్చే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపైనా కన్నేశాడు. ఇటీవల ఇంట్లో తల్లిలేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెసుకున్న తల్లి.. పటాన్‌ చెరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దిరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️