వైసీపీలో చేరిన బాలకృష్ణ

Mar 30,2024 17:06 #ap cm jagan, #bus tour, #join ycp, #YCP

ప్రజాశక్తి-అనంతపురం : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని బాలకృష్ణతో పాటు పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్‌గా పితాని బాలకష్ణ ఉన్నారు. అయితే, 2019లో పితానికి వైసీపీ టికెట్‌ నిరాకరించడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలకృష్ణ.. ఆ వెంటనే జనసేన పార్టీలో చేరారు.. గత ఎన్నికల్లో జనసేన తరపున ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగినా విజయం సాధించలేకపోయారు. అయితే, ఇప్పుడు జనసేన సీటు నిరాకరించడంతో తిరిగి వైసిపిలో చేరారు.

➡️