కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ .. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతోపాటు పలువురు అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బిఆర్‌ఎస్‌ నేతల ముఖ్య సమావేశానికి వెంకట్రావు గైర్హాజరయ్యారు.

➡️