నేటి నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి ప్రచారం..

Apr 10,2024 10:28 #Chandrababu Naidu, #pawan, #sabha

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటికే ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించాయి.. ఆ పార్టీల చీఫ్‌లు కూడా రంగంలోకి దిగనున్నారు.కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత తణుకు నరేంద్ర సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు, నిడదవోలులో రాత్రి 7 గంటలకు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గనేందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకుంటారు.. ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గననున్నారు.. తణుకు నుంచి నిడదవోలు వరకు జరగనున్న రోడ్‌ షోలో పాల్గంటారు. సభ అనంతరం నిడదవోలులోని తిరుమల సాయి కళ్యాణమండపంలో చంద్రబాబు బస చేయనుండగా.. రాజమండ్రి హోటల్లో పవన్‌ కల్యాణ్‌ బస చేస్తారు. రేపు రాత్రి 7 గంటలకు అమలాపురం చేరుకోనున్న చంద్రబాబు.. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ లో రాత్రి 8.30 వరకు జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి కిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో బస చేయనున్నారు.

➡️