ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

Ads subject to Supreme Guidelines

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు. ఆయనతో పాటు లోకేష్‌, అచ్చెన్నాయుడు, నారాయణ కూడా పిటిషన్‌న్లు వేశారు. తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు ఇచ్చేలా డిజిపికి, జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం లోపు వివరాలు ఇవ్వాలని మౌకిక ఆదేశాలు జారి చేసింది. తదుపరి విచారణను 16కి వాయిదా వేసింది.

➡️