పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి వీడియో..!

May 7,2024 11:55 #chirajeevi, #pavan kalyan, #Tweet

ప్రజాశక్తి-అమరావతి : పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చిరంజీవి మంగళవారం ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ పెట్టాడు. వీడియోలో మెగాస్టార్‌ మాట్లాడుతూ.. ‘కొణిదెల పవన్‌ కళ్యాణ్‌.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి. మంచి చేయాలనే విషయంలో ఎల్లప్పుడూ ముందుంటాడు. జనమే జయమని నమ్మిన వాడు పవన్‌.. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే అతడిని పిఠాపురం ప్రజలు గెలిపించుకోవాలని కోరుతున్నా.’ అని అన్నారు. జనాలకు ఇలాంటి నాయకుడు కావాలని ఆయన వెల్లడించారు. దయచేసి వచ్చే ఎన్నికల్లో గ్లాస్‌ గుర్తుకు ఓటు వేసి పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చిరంజీవి స్పష్టం చేశారు.

➡️