నేడు చిత్తూరులో సిఎం సభ – బస్సులు లేక ప్రజల అవస్థ

మదనపల్లె (చిత్తూరు) : మదనపల్లె లో నేడు సిఎం జగన్మోహన్‌ రెడ్డి ‘ మేమంతా సిద్ధం ‘ సభ.. సందర్భంగా … మంగళవారం పలమనేరు డిపోలో ఉన్న 56 బస్సులలో, పలమనేరు డిపో నుండి 40 బస్సులను వైసిపి శ్రేణులు బుక్‌ చేసుకున్నాయి. దీని కారణంగా బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు లేక అవస్థలుపడుతున్నారు. ఇలాంటి సభలకు ఆర్టీసీ బస్సులను పంపేటప్పుడు కళాశాలలకు సెలవు ఇవ్వచ్చు కదా ? విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడడం అవసరమా ? అని పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

➡️