చల్లటి కబురు – రేపు తెలంగాణలో వానలు

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోయాయి. తట్టుకోలేని ఉక్కపోతలో తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వానలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని చెప్పింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సోమవారం కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వానలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

➡️