నిమ్మ రైతులను నిలువునా ముంచిన మిచౌంగ్‌ తుఫాను

Dec 5,2023 16:16 #Tufan

ప్రజాశక్తి-పొదలకూరు(నెల్లూరు) : పొదలకూరు మండలంలో ప్రధానమైన పంట నిమ్మ పంట. ఈ నిమ్మ సాగు పై అందుకే ఎక్కువ మంది రైతులు  ఆధారపడి బ్రతుకుతున్నారు.  నిమ్మ రైతులను మిచాంగ్  తుఫాన్ నిలువునా ముంచేసింది తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేరులతో సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. నిమ్మచెట్ల పూత,పింది  మొత్తం రాలిపోయాయి. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ సీజన్లో కాసిన పూత నిమ్మ ధరలు అధికంగా ఉండే మార్చి, ఏప్రిల్లోకి  దిగుబడికి వస్తాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత,  పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు.ఎన్నో ఏళ్ళు కన్న బిడ్డలా సాకొన్న  నిమ్మ చెట్లు తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని నిమ్మరైతులు  కోరుతున్నారు .మండలంలో దాదాపు 3 వేల హెక్టార్లో నిమ్మ సాగు అవుతుంది. అలాగే మండలంలో వివిధ గ్రామాల్లో వరి పంట సాగుకు నారుమడులను ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం నారుమడులు దెబ్బతిన్నాయి. వివిధ గ్రామాల్లో ఈ తుఫానుకు ముందు వేసిన నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్లీ వరి పంట సాగు చేసే రైతులు నారుమడుల్లు ఏర్పాటు చేసి, వరి పంట సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దెబ్బతిన్న రైతుల కు నష్టపరిహారం అందించాలని వరి పంట సాగు చేసే రైతులు కోరుతున్నారు.

➡️