స్టీల్‌ప్లాంట్‌ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

Jan 1,2024 11:28 #Privatization, #steelplant

 ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)  :   స్టీల్‌ష్లాంట్‌ ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం జరుగుతుందని, విశాఖ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1053వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఐఎన్‌టియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ష్టాంట్‌ ప్రయివేటీకరణ అయితే ఒక్క ఉద్యోగులే కాకుండా అందరూ నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచించడం వల్లే ప్లాంట్‌కు ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్లాంట్‌కు మనుగడ ఉంటుందన్నారు. మరో చైౖర్మన్‌ డి ఆదినారాయణ మాట్లాడుతూ ప్లాంట్‌ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కడవరకూ పోరాటంలో నిలవాలని కోరారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు కొవిరి అవతారం, నగేష్‌, కారు రమణ, మంత్రి శంకర నారాయణ, పివి రామచంద్రరావు, కె శ్రీనివాసనాయుడు, పల్లం గోపి. డి యల్లాజీ రావు, వివి కృష్ణనాయడు, భాస్కరరావు, గంగవరం గోపి, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️