హైదరాబాద్‌లో చిన్నారిపై కుక్కల దాడి

May 5,2024 11:05 #Dogs attack a child, #hyderabad

హైదరాబాద్‌: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్‌ పెట్‌ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు పట్టించుకుని వీధి కుక్కల బెడద తప్పించాలన్నారు. చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా వెళ్లాలన్న భయపడే పరిస్థితి ఉందని కాలనీ వాసులు అంటున్నారు. పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️