జులై 1 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ

Jun 29,2024 11:25 #Counseling, #Engineer
  • నోటిఫికేషన్ విడుదల చేసిన కన్వీనర్ డాక్టర్ నవ్య
  • జులై 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం

ప్రజాశక్తి-అమరావతి : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై ఒకటి నుండి జులై ఏడవ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 4 నుండి 10వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని, 8 నుండి 12 వరకు 5 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పుకు 13వ తేదీ నిర్దేశించామని, 16 వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం జులై 17 నుండి 22 వరకు ఆరురోజుల పాటు అవకాశం ఉంటుందని, అయితే జులై 19వ తేదీ నుండే తరగతులు ప్రారంభం అవుతాయని డాక్టర్ నవ్య వివరించారు. బిఫార్మసీ అడ్మిషన్ల కు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల కానుంది.

➡️