విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందడంలేదంటూ … శుక్రవారం మక్కువ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస సబ్‌ స్టేషన్‌ పరిధిలోని రైతులంతా కలసి మక్కువ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వాస్తవంగా కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్‌ సక్రమంగా అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్‌ సంస్థ తమ సమస్యను పరిష్కరించుకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. దీనిపై విద్యుత్‌ సబ్‌ ఇంజనీర్‌ శివ శంకర్‌ మాట్లాడుతూ …. రెండు రోజుల్లో విద్యుత్‌ సరఫరాలకు ఏర్పడిన అంతరాయాలను లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

➡️