విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన.. మరో ముగ్గురి మృతి

Nov 29,2023 11:51 #visaka
ప్రజాశక్తి -విశాఖ  : విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వై.బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం తెల్లవారుజామున చనిపోగా.. చిన్నకుమారుడు కార్తిక్‌ (21) రెండు రోజుల క్రితమే మృతి చెందాడు.మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
➡️