సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ … ఈనెల 21కు వాయిదా…

Singareni Elections : సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు నిర్ణయం పై 27వ తేదీన జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను డిసెంబర్‌ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని ఐఎ పిటిషన్‌ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్‌ తరపున సీనియర్‌ కౌన్సిల్‌ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అంటూ హై కోర్టు ప్రశ్నించింది. సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని హైకోర్టుకు యూనియన్‌ కోరింది. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాదోపవాదాల అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కు హై కోర్టు వాయిదా వేసింది.

అయితే.. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్‌ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల గురువారం (21)వ తేదీన వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ వెనుక ఎన్‌ఐటియుసి రాజకీయం ఉందని ఎఐటియుసి ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఎఐటియుసి పై ఎన్‌ఐటియుసి నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా ? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా ? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు గురువారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

➡️