శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 24,2024 10:41 #AP High Court, #kodi kathi case

ప్రజాశక్తి-అమరావతి : వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు జె శ్రీనివాస్‌రావు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. నిందితుడి బంధువులు నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సత్వరమే పూర్తి చేయాలని ఒత్తిడి చేసేందుకు లేదని హైకోర్టు చెప్పింది. ఎన్‌ఐఎ వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఎం కిరణ్మయి ప్రకటించారు.

➡️