కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌

హైదరాబాద్‌ : గుర్తు తెలియని వాహనం ఢకొీని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జిపై అర్ధరాత్రి అనిల్‌ (25) తన స్నేహితుడితో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అనిల్‌తో పాటు అతని స్నేహితున్ని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు సిసిటీవి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

➡️