విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తున్నరన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నగదు సీజ్‌ చేసి ద్వారక పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

➡️