జగనన్న విద్యా దీవెన పథకం – పామర్రుకు చేరుకున్న సిఎం జగన్‌

పామర్రు (కృష్ణా జిల్లా) : అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికిగాను జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా … ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రుకు చేరుకున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేయనున్నారు. పామర్రుకు చేరుకున్న సిఎం జగన్‌కు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నేతలు, జిల్లా కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మి స్వాగతం పలికారు.

➡️