చంద్రగిరిలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు

Jan 1,2024 15:28 #tirupathi

ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు.  పశువుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువత పోటీ పడుతున్నారు. మరోవైపు ఈ జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. కాగా ఈ పోటీల్లో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి నిర్వహకులు సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️