తిరుమల ఘాట్‌ రోడ్డులో జీపు బోల్తా

Apr 21,2024 18:03 #road acident, #Tirupati district

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఆదివారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు గాయాలయ్యాయి. ఇందులో తమిళనాడుకు చెందిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️