ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌

Feb 1,2024 13:02 #cm kcr

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ నేరుగా అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

➡️