కుమారుడితోకలిసి వైసిపిలో చేరిన ముద్రగడ పద్మనాభం

Mar 15,2024 11:20 #joined, #Mudragada Padmanabham, #Son, #YCP

అమరావతి : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన కుమారుడితోకలిసి వైసిపిలో చేరారు. తాను తన కుమారుడు గిరితోపాటు వైసిపిలో చేరనున్నానని ముద్రగడ ముందుగానే ప్రకటించారు. ఈరోజు ఉదయం కిర్లంపూడి నుండి తాడేపల్లికి చేరుకున్నారు. వైసిపిలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగి ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ముద్రగడ పని చేశారు.

➡️