మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తత

municipal workers strike 11th day arrest

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది.

 

 

శ్రీ సత్య సాయి జిల్లా-హిందూపురం : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉదయం ఉద్రిక్తమైంది. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రైవేట్ కార్మికులను తీసుకొని వచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ పనులను ఆందోళన చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. కాళ్లు పట్టుకున్న కరుణించని అధికారులు పోలీసులు నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. కార్మికులతో పాటు మహిళా కార్మికులు ఈ అరెస్టులు అడ్డుకున్నారు. వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ తన సిబ్బందితో పాటు సచివాలయ ఉద్యోగులను తీసుకొని మహిళా కార్మికులు అని కూడా చూడకుండా మహిళలు ఈడ్చి పారేశారు. ఈ తోపులాటలో అంజనమ్మ, లక్ష్మీదేవి, పద్మావతిలు స్పృహకల్పయారు. కమలమ్మ చెయ్యికి రక్త గాయాలయ్యాయి. కనీస కనికరం లేని పోలీసులు, అధికారులు స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి సైతం తరలించలేదు. అలాగే రోడ్డుపై వదిలేశారు. అది రోడ్డుపై కార్మికులందరూ కూర్చొని అధికారులకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు కార్మికులే 108 ఫోన్ చేసి స్పృహ కోల్పోయిన కార్మికులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

municipal workers strike 11th day atp

  • పొర్లుదండాలు అరగుండులతో కార్మికుల నిరసన

అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజైనా శుక్రవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులు దండాలు పెట్టి అరగుండ్లు గీయించుకుని అరగుండ్లు గీయించుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపుగా వెళ్లి అంబేద్కర్ కు పూలమాల వేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కే మంచి బుద్ధుని ప్రసాదించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే శనివారం నుండి సమ్మె ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సెక్రెటరీ నాగేంద్ర కుమార్, సిఐటియు ఒకటో పట్టణ కార్యదర్శి వెంకట్ నారాయణ, మున్సిపల్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు బండారి ఎర్రి స్వామి కార్యదర్శి సాకే తిరుమలేష్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లప్ప, ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున రాయుడు, ఓబుళపతి, పోతులయ్య,  లక్ష్మీనరసింహ మంత్రి వరలక్ష్మి, రాఘవేంద్ర ప్రసాద్ ఆది, తదితరులు పాల్గొన్నారు .

municipal workers strike 11th day amaravati

  • మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిపిఎం మద్దతు

మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట వంటావార్పు
ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు
కార్యాలయం ఎదుటే రోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు

మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంకై చేపట్టిన సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా శిబిరం వద్ద సిఐటియు నాయకులు ఎం రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు పై వర్షం పడ్డ విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి మాట తప్పి, మడి మ తిప్పారని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని రామారావు ప్రశ్నించారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న కార్మికుల జీతాలు మాత్రం పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాల పోషణ ఏ విధంగా జరుగుతుందని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు సమ్మె పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపన చేస్తుండటం చూస్తుంటే ప్రజారోగ్యం పట్ల వీరి కున్న శ్రద్ధ ఏ పాటిదో అర్థం అవుతుందని అన్నారు. మరో ప్రక్క అధికారులు, వైసీపీ ఎమ్మెల్యేలు కార్మికులపైవేధింపులకు పూనుకోవడం దుర్మార్గమని అన్నారు.  మున్సిపల్ కార్మికులకు సిపిఎం అండగా నిలుస్తుందని అన్నారు.  తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని రామారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మద్దతు తెలిపారు.

municipal workers strike 11th day eluru

 

ఏలూరు జిల్లా పంపుల చెరువు వద్ద మున్సిపల్ కార్మికులపై పోలీసుల దాష్టీకం…. ఏలూరు కొంపలు చెరువు వెహికల్ డిపో వద్ద ధర్నా చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు…. కార్మికులను అరెస్టు చేసి వాహనాలను బయటకు పంపించిన పోలీసులు.

municipal workers strike 11th day atp

అనంతపురం జిల్లా గుత్తిలో మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్టు కార్మికుల సంఘం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.

municipal workers strike 11th day arrest wg

  • తీవ్రతరమవుతున్న మున్సిపల్ సమ్మె

పట్టణంలో మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ…

మున్సిపల్ కార్యాలయం వద్ద పోరు దండాలు

పగో జిల్లా – భీమవరం : మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతుందుంది. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులు తీసుకురావడానికి సిఐటియు ఏఐసిటియు నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించాయి. శుక్రవారం పట్టణం లోని ఏడు డివిజన్ లలో కార్మికులు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు కూడలిలో సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియచేసారు. తమ స్ధానంలో పనికి వచ్చిన పోటీ కార్మికులను వెళ్లి పోవల్సిందిగా కోరారు. ఇకపై తమ పనుల స్థానంలోకి పనికి పోటీగా వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ పనిముట్లు వదిలివేసి పోటీ కార్మికులు వెళ్లిపోయారు. శుక్రవారం నాటికి మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 11వ రోజు కొనసాగుతుంది భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మున్సిపల్ సమ్మె శిబిరంను ప్రారంభించారు. శుక్రవారం బైక్ ర్యాలీ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ అధికారులు ద్వారా సమ్మె విచ్చిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అయితే కార్మికులు పోటీ చర్యలను ఐక్యంగా తిప్పికొడతారన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు కార్మికులపై నిర్భందం, అణచివేతల చర్యలను సమాజం అంగీకరించదన్నారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ,ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రధానంగా వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికులు చెత్త టాక్టర్లపై పనిచేస్తున్న డ్రైవర్లు క్లాప్ డ్రైవర్లు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు భీమవరం మున్సిపాలిటీకి అధిక ఆదాయం వస్తున్న కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని కనీసం పనిముట్లు యూనిఫారం ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన కోర్కెలు శాంతియుతంగా పరిష్కారం చేయాలని లేని పక్షంలో అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలు జేఏసీ నాయకులు జి నాని నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, నీలాపు విశ్వనాథం, నిమ్మకాయల ధనలక్ష్మి, ధనాల చినపెధ్ధిరాజు, బంగారు ఏసేపు మాడుగుల లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

municipal workers strike 11th day arrest konaseema

  •   డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన

11వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె
కోనసీమ – మండపేట : స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపాల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాటికి 11వ రోజుకు చేరుకుంది. సందర్భంగా ఫారెస్ట్ కార్మికులు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు  పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్ వెంకటలక్ష్మి, భాను, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

ప్రకాశం జిల్లా : 11వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు…

➡️