లోకేష్‌ను ఉద్దేశించి నారా బ్రాహ్మణి ట్వీట్‌..

Nov 27,2023 16:47 #Nara Brahmani, #Nara Lokesh, #Tweet

ప్రజాశక్తి-అమరావతి : కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పాదయాత్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పున్ణప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు విశేషంగా తరలివచ్చాయి. తాటిపాక సభకు భారీ స్పందన లభించింది. దీనిపై లోకేష్‌ భార్య నారా బ్రాహ్మణి స్పందించారు. ”నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను” అంటూ బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. అంతేకాదు, లోకేష్‌ పాదయాత్ర పున్ణప్రారంభం దృశ్యాలను ఫొటోలను పంచుకున్నారు.

➡️