నేడు అనకాపల్లిలో పవన్ పర్యటన

సర్వ మతాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తా.

ప్రజాశక్తి-అనకాపల్లి : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు లే అవుట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రింగురోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. నాలుగు గంటలకు నెహ్రూచౌక్ కూడలిలో సభ నిర్వహిస్తారు. రేపు (సోమవారం) యలమంచిలిలో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు.

➡️