రాష్ట్రంలో పలుచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

May 5,2024 10:12 #Postal ballot

ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఓటు వేసేందుకు ఉద్దేశించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచే పలు ప్రాంతాల్లో ఉద్యోగులు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అధికారులు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ వారి ఎన్నికల విధి సర్టిఫికెట్లను పరిశీలించి పోలింగ్‌ బూత్లోకి అనుమతిస్తున్నారు. పోస్టల్‌ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తమ సిబ్బంది అందరికీ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వివరాలను, జిల్లా అధికారులు తెలియజేయాలని కలెక్టర్‌ కోరారు. పోస్టల్‌ ఓటు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నవారు, కలెక్టరెట్లోని హెల్ప్‌ డెస్క్‌ 1950 ను సంప్రదించాలని సూచించారు.

విజయనగరం జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఉద్యోగులు బారులు తీరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. ఉద్యోగులు ఉత్సాహంగా ఓటు వేసేందుకు ఉదయం 8.30 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 3975 మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. వీరి కోసం ఐదు కేంద్రాల్లో పోలింగ్‌ బూత్‌ లు ఏర్పాటు చేశారు.
జిల్లాలో 18,631 పోస్టల్‌ బాలెట్లు:
జిల్లాలో 18,631 మంది పోస్టల్‌ బాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బబ్బిలి నియోజక వర్గం లో 2105 మంది , చీపురుపల్లి లో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరం లో 3975 మంది ,శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాం లో 1741 మంది పోస్టల్‌ బాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎన్నికల విధుల్లో పాల్గంటున్న పి.ఓ లు, ఎ పి ఓ లు, మైక్రో అబ్జర్వర్లు , పోలీసు, ఆర్‌.టి సి ఉద్యోగులు, ఎసెన్శియల్‌ సర్వీసు లో ఉన్నవారు, కూడా ఉన్నారు. ఇందులో హౌం ఓటింగ్‌ కోసం ఆప్ట్‌ చేసుకున్న వారు 242 మంది ఉన్నారు.

చీపురుపల్లి : చీపురుపల్లి నియోజకవర్గంలో 1408 పోస్టల్‌ బేలెట్‌లు  ఏర్పాటు చేశారు.  ఓట్లుఅరగంట ఆలస్యంగా ప్రారంభమవడంతో  పోలింగ్‌ కేంద్రాల్లో ఉద్యోగులు బారులు తీరారు.

కురుపాం :కురుపాం మోడల్‌ స్కూల్లో ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌  ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. నియోజకవర్గంలో మొత్తం 2241  ఓటర్లు ఉన్నారు .

సత్తెనపల్లి  :సత్తెనపల్లి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేటర్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు ల్లో పాల్గోననున్న పిఓ ఏపిఓలకు ఓపిఒ లు మైక్రో అబ్జర్వ్స లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటలకే ఉద్యోగులు బారులు తీరారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం పరిశీలించిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లా
ప్రజాశక్తి -రామచంద్రపురం :మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందుగా ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని జిల్లా కలెక్టర్‌ హిమాన్ష్‌ శుక్ల పరిశీలించారు.రామచంద్రపురం పట్టణంలోని వి ఎస్‌ ఎం డిగ్రీ కాలేజ్‌ లో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామచంద్రపురం ఎన్నికల అధికారి ఆర్డీవో సుధాసాగర్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవలసిన ఏర్పాట్లను ఆయన వివరించారు. మూడు రోజులపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ అనుమతులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన వెంట రామచంద్రపురం తాసిల్దార్‌ ఎం వెంకటేశ్వర రావు పలువురు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️