తిరుమలకు ప్రధాని మోడీ

-అడుగడుగునా నిఘా

-ఎస్‌పిజి కంట్రోల్‌లో తిరుమల, తిరుపతి

-రేపు శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలుాస్వాగతం పలికిన గవర్నర్‌, సిఎం

ప్రజాశక్తిా తిరుపతి బ్యూరోతిరుపతిాతిరుమల రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.35 గంటలకు తిరుపతి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అహ్మద్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని రోడ్డు మార్గం గుండా తిరుమలలోని రచన అతిథి గృహానికి 8.25 గంటలకు చేరుకున్నారు. ఆయనకు టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిని రెండు రోజులపాటు ఎస్‌పిజి కంట్రోల్‌కి తీసుకుంది. మూడు వేల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు, అడుగడునా భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని ప్రధాని దర్శించుకుంటారు. దాదాపు అరగంటపాటు శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గంటారు. అనంతరం 12 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక నావికాదళ విమానంలో బయలుదేరి తెలంగాణ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గననున్నారు. తిరుమల రచన గెస్ట్‌ హౌస్‌ వద్ద ప్రధానికి స్వాగతం పలికిన వారిలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఇఒ ధర్మారెడ్డి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కి, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి డిప్యూటీ సిఎం నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,హొ టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి,హొఎంపిలు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి,హొ డాక్టర్‌ గురుమూర్తి, రెడ్డెప్ప, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. సిపిఎం, సిపిఐ నాయకుల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుమలకు వస్తున్న సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పలువురు సిపిఎం, సిపిఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి వెంట షాడో పార్టీని ఏర్పాటు చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.జయచంద్ర, జిల్లా అధ్యక్షులు ఎం.నరేంద్ర తదితరులను సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్బంధించారు. తిరుచానూరులో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుమన్‌ను, అలిపిరిలో ఆర్‌.లక్ష్మిని గృహనిర్బంధంలో ఉంచారు. వెంకటగిరిలో చెంగయ్యను, పుత్తూరులో వెంకటేశును, బుచ్చినాయుడు కండ్రిగలో సిపిఐ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్యను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సిపిఎం ఖండనసిపిఎం, సిపిఐ తదితర వామపక్ష నాయకుల అక్రమ నిర్బంధాన్ని, అరెస్టులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం ప్రజల తరుఫున పోరాడుతున్న వారిని గృహనిర్బంధాలు, అరెస్టులు చేసి నిరసనలను అణచివేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మాటతప్పి తిరుపతిని అవిత్రం చేశారని విమర్శించారు. నిర్బంధాలకు స్వస్తి చెప్పి రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️