స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విరమించుకోవాలి

Apr 14,2024 21:45 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1158వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో కూర్చున్నవారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటుపరమైతే రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు, మహిళలు, వికలాంగులకు తీవ్ర అన్యాయం జరగనుందని తెలిపారు. దేశాభివృద్ధికి మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిపోయి ఉన్న వాటిని అమ్మేయాలని చూడడం దుర్మార్గమన్నారు. తొలుత దీక్షా శిబిరంలో అంబేద్కర్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ, వైసిపి బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎన్నేటి రమణ, వైఎస్‌ఆర్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప పాల్గొన్నారు.

➡️