1250 మంది వలంటీర్ల రాజీనామా

Apr 15,2024 23:15 #resignation, #volunteers

ప్రజాశక్తి – తూర్పుగోదావరి : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో 1,200 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా సోమవారం రాజీనామా చేశారు. ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా తాము రాజీనామా చేశామని వలంటీర్లు తెలిపారు. అనంతరం వైసిపి నాయకులు నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొ న్నారు. దీనిపై కొందరు సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సిబ్బంది అక్కడికి చేరుకుని ఆరా తీశారు. సమావేశానికి సంబంధించిన అనుమతులను వైసిపి మండపేట పట్టణ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు అధికారులకు చూపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి, వైసిపి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాజులూరు, ఏలేశ్వరంలో 50 మంది వలంటీర్లు రాజీనామా చేశారు.

➡️