ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు ఆమోదయోగ్యం

Dec 28,2023 21:50 #Dharna, #SFI

– జెఎన్‌టియుకె విసి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు జివిఆర్‌ ప్రసాద్‌రాజు

ప్రజాశక్తి – కాకినాడ:ఎస్‌ఎఫ్‌ఐ చేసే పోరాటాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయని అందువల్ల ఎస్‌ఎఫ్‌ఐ అనేసరికి తాను ఉత్తేజితమవుతానని జెఎన్‌టియుకె విసి, ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్‌ జివిఆర్‌.ప్రసాద్‌రాజు తెలిపారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ రెండో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆలోచన విధానం ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కేవలం విద్యకు సంబంధించిన సమస్యలపైనే కాకుండా ప్రజా సమస్యలపై కూడా పోరాడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొందన్నారు. జెఎన్‌టియుకె పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాణ్యత, అప్‌డేషన్‌తో కూడిన విద్యను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. విసి వెంట జెఎన్‌టియుకె స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ ఉన్నారు. అనంతరం విసి ప్రసాద్‌రాజు, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ శ్యామ్‌లకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు జ్ఞాపికలు అందించి సత్కరించారు.

➡️