దీక్ష విరమించిన శ్రీను తల్లి, సోదరుడు

Jan 22,2024 11:08 #Andhra Pradesh

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పై ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాస్‌ తల్లి, సోదరుడు ఆదివారం దీక్ష విరమించారు. నిరహార దీక్ష చేపట్టిన వారిని శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రులోనూ వారు దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపి హర్షకుమార్‌, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారి తరుపున దీక్ష కొనసాగిస్తామని సమతా సైనిక్‌ దళ్‌ నాయకులు ప్రకటించారు.

➡️