‘ఉక్కు’ ప్రయివేటీకరణ దారుణం

Apr 3,2024 23:15 #ukkunagaram, #visakha steel
visakha-steel-plant manganese mines

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయిటీకరించాలని చూడడం దారుణమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1147వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్లాంట్‌పై కేంద్ర బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు అవసరమని అన్నారు. పరిశ్రమను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేయకుండా ప్రయివేటు శక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న మోడీ సర్కారుకు రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

➡️