పట్టుబడ్డ చీరలు 

ప్రజాశక్తి – సోమల : చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రమైన సోమల బస్టాండ్ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో నుండి కొన్ని కట్టల చీరలు కనిపించాయి. తెలుగు దేశం నాయకుల జెండాలు కూడా ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కారులోని వ్యక్తులను తమ ఆధీనంలో ఉంచుకొని వివరాల సేకరణలో ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ పార్టీకి సంబంధించిన చీరలు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

➡️