Telangana : జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు

Jun 29,2024 10:51 #DSC Exams, #July 18, #Telangana

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ టీచర్‌ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ… తాజాగా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎలాంటి పరీక్షలు ఉండవు. జులై 18న స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్‌ పండిట్‌(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం, ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.

➡️