తెలంగాణ WJF రాష్ట్ర ప్రధానకార్యదర్శి బసవపున్నయ్యకు మాతృ వియోగం

తెలంగాణ : తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (WJF) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవ తెలంగాణా ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య అమ్మ బొడిగె ఊషమ్మ (80) కొద్దిసేపటి క్రితం చనిపోయారు. ఇటీవల ఆమె ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటలకు చనిపోయారు. ఆమె పార్థీవదేహాన్ని వనస్థలిపురంలోని హుడా కాంప్లెక్స్‌ సాయినగర్‌ (ఎల్లమ్మ టెంపుల్‌ దగ్గర) ఆమె పెద్ద కుమారుడు సుందరయ్య ఇంటి వద్ద ఉంచి, ఈరోజు సాయంత్రం 4 గంటలకు సమీపంలోని సాహెబ్‌ నగర్‌ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

➡️