మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత – విద్యార్థుల ఆందోళన

తెలంగాణ : మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త నెలకొంది. పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయిన సుమారు 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం డిటైన్‌ చేయడంతో వారంతా సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు. విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతిచ్చారు. యూనివర్సిటీ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

➡️