నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు అరెస్ట్‌

నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరెట్‌ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలని డిమాండ్‌ చేస్తూ … ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డగించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

➡️