కారును డీ కొట్టి టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ

Dec 26,2023 15:25 #nijamabad, #road accident

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ ముందు వెళ్తున్న కారును డీ కొట్టాడు. అనంతరం లారీ టోల్‌ ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టోల్‌ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన టోల్‌ ప్లాజా సిబ్బంది.. బాధితులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️