MSME: దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర కీలకం

Mar 7,2024 09:51 #development, #MSME

స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌

ప్రజాశక్తి -గాజువాక : దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర ఎంతో కీలకమని స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ అన్నారు. బుధవారం గాజువాక ఆటోనగర్‌లో ఎంఎస్‌ఎంఇ ఎక్స్‌పోను ఎడిసి చంద్రశేఖర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌ ఉత్పత్తిలో ముందున్న అమెరికా, చైనా, యూరప్‌ దేశాలు, అభివృద్ధిలోనూ అగ్రగామిగా ఉన్నాయన్నారు. భారత్‌లోనూ స్టీల్‌ అభివృద్ధి గణనీయంగా పెరిగిందని, రానున్న రోజుల్లో పరిశ్రమల యజమానులకు అన్ని విధాలా బాగుంటుందన్నారు. ప్రపంచ మార్కెట్‌తో మనమూ పోటీ పడాలన్నారు. యువ పారిశ్రమికవేత్తలు ఎంఎస్‌ఎంఇని ఆశ్రయించి, ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐలా చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, సెక్రటరీ చీకటి సత్యనారాయణ, వాసవ అధ్యక్షులు పాండురంగ ప్రసాద్‌, గాజువాక ఆటోనగర్‌ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

➡️