ఆర్‌టిసి ఐటి సిబ్బంది సేవలు అభినందనీయం

Mar 4,2024 20:39 #APSRTC

ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ స్థాయిలో 2024కు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగంలో వరుసగా 6వ సారి ఎపిఎస్‌ఆర్‌టిసి డిజిటల్‌ టెక్నాలజీ సభ అవార్డుకు ఎంపికవడం పట్ల ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిని ఆయన సత్కరించారు. కోల్‌కతాలో డిజటల్‌ అవార్డును అందుకున్న అధికారులను సోమవారం విజయవాడలోని ఆర్‌టిసి హౌస్‌లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ.. దేశంలో ఏ ఆర్‌టిసి చేయని విధంగా ఎపిఎస్‌ఆర్‌టిసి యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే కాగిత రహిత టికెట్లను ఆర్‌టిసి అమలు చేస్తోందన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసి సాంకేతికంగా పురోభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ఐటి చీఫ్‌ ఇంజినీరు ఎ సుధాకర్‌, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీరు వై గంగాధర్‌ తదితరులు పాల్గన్నారు.

➡️